దివ్యాంగుల హక్కులను కాపాడుతాం : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

దివ్యాంగుల హక్కులను కాపాడుతాం : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వెలుగు నెట్​వర్క్​ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన క్రీడాల్లో ప్రతిభ చూపిన దివ్యాంగులకు బహమతులతోపాటు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు హక్కులను కాపాడడడంతోపాటు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తామని ప్రభుత్వ విప్​ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. 

రాజాపేట భవిత సెంటర్​, కలెక్టరేట్​లో వేర్వేరుగా నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో దివ్యాంగులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ నెలలో ఒకరోజు దివ్యాంగుల కోసమే ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుండి భవిష్యత్​కు పునాది బాటవేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ సూచించారు. జిల్లా కేద్రంలోని ఐడీవోసీ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. నల్గొండలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.