పోలవరంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...

పోలవరంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనాపరంగా తన మార్క్ వేసే దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ పోలవరం, అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. ఇటీవలే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.అంతర్జాతీయ నిపుణులతో పోలవరం ప్రజెక్టుపై పరిశీలన జరపాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఆదివారం ఢిల్లీకి చేరుకున్న అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును నాలుగురోజుల పాటు పరిశీలించనుంది. ప్రాజెక్టులో ఏర్పడ్డ సాంకేతిక సవాళ్ళను పరిష్కరించేందుకు ఈ బృందాన్ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో అంతర్జీతీయ నిపుణులతో పాటు ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రతినిధులు, మేఘా వంటి కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్‌ సంస్థ అఫ్రి ప్రతినిధులు పోలవరాన్ని సందర్శించనున్నట్లు తెలుస్తోంది.