ఆదిలాబాద్‌టౌన్/దండేపల్లి, వెలుగు : అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని రైతుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్పట్టణంలోని కిసాన్ చౌక్‌లో రైతు విగ్రహానికి పూలమాలలు వేశారు. రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రైతు కష్టాన్ని తెలియజేసేందుకు..
జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని దండేపల్లి మండలం గుడిరేవు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం బొలిశెట్టి బుచ్చన్న.. రైతు శ్రమ తెలియజేసేందుకు విద్యార్థులను వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లారు. దేశానికి వెన్నుముక అయిన రైతన్న శ్రమను విద్యార్థులకు వివరించారు. అనంతరం రైతులను సన్మానించారు. టీచర్లు తదితరులు పాల్గొన్నారు.