జూబ్లీహిల్స్, వెలుగు: తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను మార్చి 23 నుంచి 26 వరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు దిలీప్ కుమార్, కార్యదర్శి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు మాట్లాడారు.
ఫెస్టివల్లో షార్ట్‌ఫిల్మ్స్, ఫ్యూచర్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, మ్యూజిక్, వీడియో, యానిమేషన్ల ప్రదర్శనకు ఆన్లైన్లో ఎంట్రీలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేయననున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ప్రసాద్ గౌడ్, సత్యనారాయణ జాదవ్, నాగేందర్ గౌడ్ పాల్గొన్నారు.