వరంగల్ నగరంలో నలుగురు అంతర్జాతీయ దొంగల ముఠాను మట్టేవాడ పోలీసుల అరెస్టు చేశారు. వారి నుండి కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో.. పెద్ద పెద్ద వాహనాలు కొనుగోలు చేస్తూ.. వాహనాలకు సంబంధించిన ఫైనాన్స్ ఈఎంఐ కడతామని నమ్మించి మోసం చేస్తు్న్నారు.
ఈఎంఐ ద్వారా వాహనాలను కొనుగోలు చేసి..ముంబయిలోని కొంతమంది వ్యక్తుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో హైదరాబాదు నుండి 16 కేసులలో జైలుకు సైతం వెళ్లి.. బయటకి వచ్చినా.. పద్ధతి మార్చుకోకుండా, యదావిధిగా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈఎంఐపై సుమారు రూ.4.30 కోట్లు విలువ చేసే వాహనాలను అమ్మారని వరంగల్ డీసీపీ తెలిపారు.