ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మార్కెట్ అనుకూలం

  • సెన్సెక్స్‌తో పోలిస్తే నష్టాలు తక్కువంటున్న ఎనలిస్టులు
  • దేశాలవారీగా ఎంఎఫ్ లను ఎంచుకోవచ్చు
  • సెక్టార్ల వారీగానూ ఇన్వెస్ట్​ చేయొచ్చు
  • గ్లోబల్ కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే చాన్స్

బిజినెస్​ డెస్క్​, వెలుగు: మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితులు ఫారిన్​ ఈక్విటీ, ఎక్సేంజ్​ ట్రేడెడ్​ ఫండ్స్​, ఇంటర్నేషనల్​ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒకే దానిలో కాకుండా రకరకాల రంగాల్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని అంటున్నారు. అయితే ఫారిన్​ మార్కెట్లలో ఇన్వెస్ట్​ చేసే ముందు రెండు విషయాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఏ ఎసెట్​ కొనాలనేది ఒకటోది అయితే ఎంత మొత్తం పెట్టొచ్చు అనేది రెండోది. మొదటి ప్రశ్న అడిగినప్పుడు.. సంపన్న దేశాల మార్కెట్ల నుంచి కొన్ని షేర్లను కొనుక్కోవడం తెలివైన పని అని పర్సనల్​ ఫైనాన్స్​ ఎక్స్​పర్టులు జవాబిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక దేశంలో ఈక్విటీ మార్కెట్​నెగటివ్​లో ఉన్నంతమాత్రాన వేరే దేశంలోనూ అలాంటి పరిస్థితి ఉంటుందని అనుకోకూడదు. ఉదాహరణకు 2015లో సెన్సెక్స్​ విపరీతంగా నష్టపోయింది. యూరప్, జపాన్​ మార్కెట్లు మాత్రం అదే ఏడాది బాగా లాభాలను సంపాదించాయి. 2017లో సెన్సెక్స్​ 28 శాతం లాభాలను అందిస్తే, చైనా హాంగ్​సెంగ్​ సూచీ 36 శాతం నష్టపోయింది. గ్లోబల్​ క్రైసిస్​ వచ్చినప్పుడు అమెరికా వంటి మార్కెట్లు ఇండియా లాంటి మార్కెట్ల కంటే తక్కువ నష్టపోతాయి. 2000 సంవత్సరంలో టెక్ సెక్టార్ ​కుప్పకూలినప్పుడు సెన్సెక్స్​21 శాతం పడిపోతే, అమెరికా డో జోన్స్​ సూచీ కేవలం ఆరు శాతం నష్టపోయింది. 2008లో సెన్సెక్స్​ 52 శాతం నష్టపోతే, యూఎస్​ మార్కెట్లలో కేవలం 34 శాతం కరెక్షన్​ వచ్చింది.

సెక్టార్ల ఎంపికా ముఖ్యమే…

డాలర్​ ఆధారిత మార్కెట్లలో ఇన్వెస్ట్​మెంట్​కు ప్రయారిటీ ఇవ్వడంతోపాటు ఏయే సెక్టార్లో డబ్బు పెట్టాలనేది ముఖ్యమే! చాలా ఇంటర్నేషనల్​ కంపెనీలు గోల్డ్​ఫండ్స్​, రియల్టీ ఫండ్స్​, అగ్రి ఫండ్స్​వంటి ఏదో ఒక ఇంటర్నేషనల్​ మ్యూచువల్​ ఫండ్​లో ఇన్వెస్ట్​ చేస్తాయి. ఇది వరకే ప్లెయిన్​ ఫండ్స్​లో, డొమెస్టిక్​ ఈక్విటీల్లో డబ్బు పెట్టిన వారికి ఇవి అనువైన ఫండ్స్​. ఇవి వద్దనుకుంటే ఫండ్స్​ ఆఫ్​ ఫండ్స్​లోనూ ఇన్వెస్ట్​మెంట్ చేయవచ్చు. ఇవి డొమెస్టిక్​ మార్కెట్​ నుంచి కార్పస్​ను సమీకరించి సేమ్​ పేరెంట్​ కంపెనీ ఆఫ్​షోర్​ ఫండ్స్​లో మదుపు చేస్తాయి. ఫండ్​ మేనేజర్​ఇండియాలోనే ఉంటూ ఇన్వెస్ట్​మెంట్లపై నిర్ణయాలు తీసుకుంటాడు.

యూఎస్​ మార్కెట్​ ఎందుకు బెస్ట్​​?

ఇండియా వంటి డెవలపింగ్​ కంట్రీల స్థూల ఆర్థిక వ్యవస్థలకు ఆటుపోట్లు వస్తే ఇక్కడి ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఆయిల్​ ధరలు పెరిగినా, డాలర్​ విలువ పెరిగినా, ఎఫ్​పీఐలు తమ ఇన్వెస్ట్​మెంట్లను వెనక్కి తీసుకున్నా సెన్సెక్స్​ నష్టపోయే అవకాశాలు ఎక్కువ. అమెరికా మార్కెట్ల ఇన్వెస్టర్లకు ఇలాంటి భయాలు అవసరం లేదు. కరెక్షన్​ చాలా తక్కువగా ఉంటుంది. డాలర్​ విలువ పెరిగితే ఓవర్సీస్​ ఇన్వెస్టర్లకు ఇంకా లాభం. అయితే చైనా, జపాన్​వంటి ఎమర్జెన్సీ మార్కెట్లలో ఈక్విటీలు కొనడం వేస్ట్​. ఎందుకంటే ఈ దేశాల ఇండెక్స్​లు కూడా సెన్సెక్స్​ మాదిరే పనిచేస్తాయి. మనదేశంలోని చాలా స్టాక్​బ్రోకరేజీ కంపెనీల ద్వారా ఇంటర్నేషనల్​ మార్కెట్లలో ఇన్వెస్ట్​ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు

టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌

హైదరాబాద్​లో భూములపై పెట్టుబడి రూ.7 వేల కోట్లు

శేఖర్ కమ్ముల ‘నీ చిత్రం చూసి’ సాంగ్ రిలీజ్