International Joke Day : కొన్ని ఫ్యామిలీ జోకులతో హ్యాపీగా నవ్వేద్దామా..

International Joke Day : కొన్ని ఫ్యామిలీ జోకులతో హ్యాపీగా నవ్వేద్దామా..

ప్రపంచ జోకుల దినం.. అవును ప్రతి సంవత్సరం జూలై నెల ఒకటో తేదీన జరుపుకుంటుంది. జోక్స్ లో కొన్ని కుళ్లు జోకులు ఉంటాయి.. మరికొన్ని పగలబడి నవ్వే జోకులు ఉంటాయి.. ఫ్యామిలీ జోకులు మాత్రం టాప్ అంట.. అవును.. భార్యభర్తలపై ఉండే జోకులే ఎక్కువంట.. ఇంట్లో మొగుడు పెళ్లాల మధ్య వచ్చే సన్నివేశాలతో వచ్చే జోకులకే ఎక్కువ నవ్వులు ఉంటాయని చెబుతున్నారు.. అలాంటి ఓ నాలుగు జోకులు సరదాగా చదువుకుంటూ.. నవ్వుకుందామా..

===

భార్య : నేను అకస్మాత్తుగా తప్పిపోతే మీరేం చేస్తారండీ..?
భర్త : ఎందుకు.. అలా అన్నావ్..? నువ్వు తప్పిపోతే నేనేం ఊరికే ఉంటాననుకున్నావా..? టీవీల్లో పేపర్లలో అడ్వర్టైజ్ మెంట్స్ ఇస్తాను.. నువ్వెక్కడ ఉన్నా.. సుఖంగా ఉండాలని..!

===

వెంగళప్ప : ఇంట్లో ఉన్న పప్పులన్నీ బయట పడేయ్..?
రాధ : ఎందుకు..?
వెంగళప్ప : ఇందాక పక్కింటాయన నీ పప్పులేవీ ఉడకవ్ అన్నాడు..?

=====

సుందరి, సుబ్బారావు భార్యభర్తలు
ఏడు గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు.. చివరికి..
సుబ్బారావు : సరేనే.. పైన దేవుడున్నాడు. నాది తప్పయితే నేనే పోతాను అన్నాడు రొప్పుతూ..
సుందరి : గుళ్లో అమ్మోరు ఉంది. నాదే తప్పయితే.. నా పసుపు కుంకాలే పోతాయిలే..! అంది ముక్కు చీదుతూ..

===

తండ్రి : నాన్నా లస్సీ తాగుతావా?
కొడుకు : వద్దు
తండ్రి : పాలు తాగుతావా?
కొడుకు : వద్దు
తండ్రి : జ్యూస్ తాగుతావా?
కొడుకు : వద్దు
తండ్రి : అచ్చు అమ్మపోలికే.. రక్తం మాత్రమే తాగుతాడు వెధవ.
అక్కడే ఉన్న అమ్మ అది విని తట్టుకోలేకపోయి..
తల్లి : యాపిల్ తింటావా నాన్నా?
కొడుకు : వద్దు
తల్లి : అరటి పండు తింటావా?
కొడుకు : వద్దు
తల్లి : మామిడి పండు తింటావా?
కొడుకు : వద్దు
తల్లి : అచ్చు నాన్న బుద్దులే.. దెబ్బలు మాత్రమే తింటాడు వెధవ..!

====

టీచర్ : రవి.. ఎదుటి వాళ్లకు ఆసక్తి లేకున్నా మాట్లాడేవాళ్లని ఏమనాలి?
రవి : టీచర్ అంటారు టీచర్..!
====