అపోలో రీచ్‌‌‌‌‌‌‌‌లోఇంటర్నేషనల్​ కిడ్నీ డే

కరీంనగర్ సిటీ, వెలుగు: మనిషి శరీరంలో మూత్రపిండాలు కీలకమని కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ కొత్త చాందిని , డాక్టర్ ఎస్ సురేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అపోలో రీచ్ హాస్పిటల్ గురువారం ఇంటర్నేషనల్​కిడ్నీ డే నిర్వహించారు. అపోలో రీచ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్​డాక్టర్ ఎస్.నాగ సతీశ్​  మాట్లాడుతూ  అపోలో రీచ్ హాస్పిటల్ యాజమాన్యం నెఫ్రాలజీ , యూరాలజీ హెల్త్ ప్యాకేజీని తక్కువ ధరలకు అందుదుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. జూలై 31 వరకు రూ.999 చెల్లించి టెస్టు చేసుకోవచ్చన్నారు. అనంతరం  కిడ్నీ వ్యాధిగ్రస్తులు 50 మందికి కుట్టుమిషన్లు, పౌష్టికాహారం,  మందులు అందజేశారు.