హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి మొదలైంది. సోమవారం (జనవరి13) సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మంత్రులు పొన్న ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర టూరిజం , భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ఇవాళ్టి నుంచి జనవరి 15 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కైట్ ఫెస్టివల్లో ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాలనుంచి47 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. 14 రాష్ట్రాల నుంచి 54మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటారు.
ALSO READ | గుడ్ న్యూస్: జనవరి 26 నుంచి తెలంగాణలో 4 కొత్త పథకాలు అమలు
కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. నోరూరించే రకరకాల పిండివంటలు, స్వీట్స్ తో కూడిన వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 11 వందల వంటకాలు ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఐఏఎస్ స్మితా సబర్వాల్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, ఇబ్రహీంపట్నం mla మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.