- పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ షురూ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ రంగు రంగుల, వెరైటీ పతంగులతో కలర్ఫుల్గా మారింది. మరోవైపు వందల స్టాల్స్‌లో స్వీట్స్ నోరూరిస్తున్నాయి. సోమవారం ఇంటర్నేషనల్ కైట్స్అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ఏర్పాటు చేయగా దేశ విదేశాల నుంచి కైట్ ప్లేయర్లు, కైట్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. తిలకించడానికి వేలాది మంది సందర్శకులు తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మరో రెండు రోజులపాటు
ఈ వేడుకలు కొనసాగుతాయి. - వెలుగు, హైదరాబాద్ సిటీ
ఇంటి వంటకాలతో స్టాల్
హైదరాబాద్ స్వీట్ ఫెస్టివల్‌కు రావడం ఇది రెండోసారి.. మేము గర్జలు, గులాబ్ జామ్, పప్పు భక్ష్యాలు, నువ్వుల భక్ష్యాలు, రవ్వ బూరెలు ఇలా చాలా రకాల స్వీట్స్ తయారు చేసి తీసుకొచ్చాం. మా స్వీట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది. ఐటమ్స్ అన్నీ మా ఇంట్లో తయారు చేసినవే. హైదరాబాద్ స్వీట్ ఫెస్టివల్‌కు రావడం చాలా హ్యాపీగా ఉంది. – సంగీత, మహారాష్ట్ర
ఐ లవ్ హైదరాబాద్.. మళ్లీ మళ్లీ వస్తా
ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు టూరిజం వాళ్ల హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ ఇండియన్ కల్చర్.. స్పిరిచ్యువాలిటీ.. ఫీలింగ్ సో హ్యాపీ.. ఇప్పటివరకు కైట్ ఫెస్టివల్ కోసం పది సార్లు ఇండియాకు వచ్చాను. హైదరాబాద్ ఫెస్టిల్‌లో పాల్గొనడం ఇది నాలుగోసారి. హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను చూశాను. చాలా బాగుంది. హుస్సేన్ సాగర్ బుద్ధ స్టాచ్యూ చాలా నచ్చింది.
మళ్లీ.. మళ్లీ హైదరాబాద్‌కు వస్తా.– బ్లాండిన్, ఫ్రాన్స్
కైట్స్ ఎగరవేసేందుకు నో ఏజ్ లిమిట్
వర్క్‌బిజీలో చాలా మంది సన్‌లైట్‌కు దూరంగా ఉంటున్నారు. సంక్రాంతి సందర్భంగా కైట్స్ ఎగరవేయడంతో నేరుగా సన్ లైట్ పడుతుంది. శరీరానికి డి– విటమిన్ లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో దీంట్లో ఏజ్ లిమిట్ ఉండదు. ఎవరైనా కైట్స్ఎగరవేయొచ్చు. నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం. అందుకే ఈసారి ‘ఐ లవ్ తెలంగాణ’ పేరుతో పతంగి ఎగరవేశాను. కైట్ ఫెస్టివల్ కోసం తెలంగాణకు రావడం సంతోషాన్నిచ్చింది. ఏటా కైట్ ఫెస్టివల్‌కు వస్తుంటా. - హేమంత్ కుమార్, బెంగళూరు