హైదరాబాద్​లో ఇంటర్నేషనల్​ లీగల్​ సెంటర్​ప్రారంభం

హైదరాబాద్​లో ఇంటర్నేషనల్​ లీగల్​ సెంటర్​ప్రారంభం

జూబ్లీహిల్స్, వెలుగు : యూఎస్​కు చెందిన గెహిస్​ ఇమ్మిగ్రేషన్ ​ఇంటర్నేషనల్​లీగల్​ సర్వీస్​సంస్థ బ్రాంచ్​ను శుక్రవారం టీపీసీసీ జనరల్​సెక్రటరీ అద్దంకి దయాకర్​ ప్రారంభించారు. అమెరికా తర్వాత ముంబై, హైదరాబాద్​లోనే ఈ సంస్థ ఉందని దయాకర్​అన్నారు. 

విదేశాల్లో ఉన్నవారికి వీసా, ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదురైనప్పుడు న్యాయపరమైన అంశాలను అధిగమించేందుకు సంస్థ తోడ్పడుతుందన్నారు. నిర్వాహకుడు నరేష్​ ఎం గెహి, సుధాజైన్​ సోషలైట్​పాల్గొన్నారు.