
జూలై 20 నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన రోజు. సరిగ్గా ఇదే రోజు ‘చంద్రునిపై మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు’ అని చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన తర్వాత అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎంతో ఉద్విగ్నంగా ఆనాడు చేసిన కామెంట్స్‌కు ప్రపంచం మొత్తం ఎమోషనల్ అయ్యారు. సరిగ్గా 55 ఏళ్ల క్రితం అనగా జూలై 20, 1969న అమెరికన్ వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై కాలు మోపి నడిచారు. అప్పటినుంచి చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.