క్రికెట్ ఫ్యాన్స్కు చేదు వార్త. ఒలింపిక్స్లో క్రికెట్ను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు అంతర్జాతీయ ఒపింపిక్ కమిటీ బ్యాడ్ న్యూస్ను తెలియజేసింది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చలేమని ఐసీసీకి వెల్లడించింది.
ఒలింపిక్స్ చరిత్రలో 1900లో ఒక్కసారి మాత్రమే క్రికెట్ను చేర్చారు. పారిస్లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్ ఈవెంట్లో గ్రేట్ బ్రిటన్, ఆతిథ్య ఫ్రాన్స్ మాత్రమే పాల్గొన్నాయి. టెస్టు ఫార్మాట్లో జరిగిన ఈ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో గ్రేట్ బ్రిటన్ 117 పరుగులకు ఆలౌట్ కాగా..ఆ తర్వాత ఫ్రాన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో గ్రేట్ బ్రిటన్ 5 వికెట్లకు 145 పరుగులు చేసి డిక్లెర్డ్ చేసింది. 185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఫ్రాన్స్..26 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కనిపించలేదు.
ఒలింపిక్స్‌లో ఏయే క్రీడలను చేర్చాలనే అంశంపై 2022 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో మొత్తం 28 క్రీడలను ఎంపిక చేసింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఈ 28 ఆటలను ఆడేందుకు ఖరారు చేసింది. అందులో క్రికెట్ లేదు. అయితే ఆ తర్వాత మరో 8 క్రీడలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. దీంతో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ క్రికెట్‌ను చేర్చవచ్చని ఫ్యాన్స్ భావించారు. అయితే తాజాగా 2028 ఒలింపిక్స్లోనూ క్రికెట్ చేర్చలేమని ఐసీసీకి ఒలింపిక్స్ కమిటీ స్పష్టం చేసింది. అయితే లాస్ ఏంజెల్స్ తర్వాత 2032లో మరో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం 2032 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో అయినా క్రికెట్‌ను చేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.
2022లో జరిగిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. కేవలం మహిళల క్రికెట్ కుమాత్రమే అవకాశం కల్పించారు. ఇందులో భారత్‌తో సహా ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో భారత మహిళల జట్టు..ఆస్ట్రేలియా జట్టు పోటీపడగా..ఆస్ట్రేలియా టీమ్ 3 వికెట్లతో గెలిచి గోల్డ్ మెడల్ గెలిచింది. భారత జట్టు సిల్వర్ తో సంతృప్తి పడింది. అంతకు ముందు 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఆడారు.