హైదరాబాద్ లో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం

  •     17 మంది అమ్మాయిలను రక్షించిన పోలీసులు
  •     ఇద్దరు కస్టమర్లు, నిర్వాహకుడి అరెస్టు 

గచ్చిబౌలి, వెలుగు : విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితోపాటు ఇద్దరు కస్టమర్లను గచ్చిబౌలి పోలీసులు  అరెస్టు చేశారు. వీరి చెర నుండి 17 మంది విదేశీ యువతులను రెస్య్కూ చేసి సేఫ్​ హోమ్​కు తరలించారు. అల్లాపూర్  పద్మావతినగర్​కు చెందిన శివకుమార్​ కొండాపూర్​ ప్రొఫెసర్స్​ కాలనీలో ఓ అపార్ట్​మెంట్​ను రెంట్​కు తీసుకున్నాడు. కెన్యా, ఉగాండా, టాంజానియా దేశాల నుంచి ఇండియాకు వచ్చి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్​లో ఉంటున్న యువతుల ప్రొఫైల్స్​ను ఓ మహిళ ద్వారా శివకుమార్​ సేకరించాడు. ఆ వివరాలను లోకాంటో వెబ్​సైట్​లో పెట్టి కస్టమర్లను వల వేస్తున్నాడు.

Also Read :- అమెరికాలో తెలుగోళ్ల వ్యభిచార ముఠా

 ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి యువతులకు అపార్ట్​మెంట్, హోటళ్లలో మంచి సౌకర్యాలు కల్పించి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో  గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్​ ట్రాఫికింగ్​ పోలీసులు బుధవారం రాత్రి అపార్ట్​మెంట్​పై దాడి చేసి 17 మంది విదేశీ యువతులను రెస్క్యూ చేశారు. నిర్వాహకుడు శివకుమార్​తోపాటు ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు సెల్​ఫోన్లు, 20 వేల క్యాష్​, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మహిళల్లో14 మంది కెన్యా, ఇద్దరు ఉగాండా, టాంజానియాకు చెందిన ఒక మహిళా ఉన్నారు.