స్కూళ్లలో సెడిమెంటేషన్ ఫిల్టర్ పనితీరు పరిశీలన

స్కూళ్లలో సెడిమెంటేషన్ ఫిల్టర్ పనితీరు పరిశీలన

చండ్రుగొండ, వెలుగు :  చండ్రుగొండ మండల పరిధిలోని స్కూళ్లలో కలెక్టర్ అమలు చేసిన సెడిమెంటేషన్ ఫిల్టర్ ను మంగళవారం అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. యునిసెఫ్ కన్సల్టెంట్ కేసు స్టడీ లో భాగంగా మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలైన  తుంగారం, టేకులబంజరు పీఎస్ స్కూళ్ల ను అంతర్జాతీయ శాస్తవేత్త డాక్టర్ ఎన్. భాస్కర్ రెడ్డి, వాష్ ప్రోగ్రాం  కోఆర్డినేటర్ నిర్మల సందర్శించారు.

 స్టూడెంట్స్ తాగునీటి కోసం అమలు చేస్తున్న సెడిమెంటేషన్ ఫిల్టర్ పనితీరు పరిశీలించారు.  స్టూడెంట్స్ తో  బోరు నీరు, ఫిల్టర్ నీటిని తాగించి ఎలా ఉన్నాయని  సర్వే చేశారు.  సర్వే వివరాలను కలెక్టర్ కు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీశ్ కుమార్, ఎంఈవో సత్యనారాయణ, మండల నోడల్ ఆఫీసర్ సత్యనారాయణ, హెచ్ఎంలు  పాల్గొన్నారు.