గీతం వర్శిటీలో ముగిసిన ఇంటర్నేషనల్​ సెమినార్

గీతం వర్శిటీలో ముగిసిన ఇంటర్నేషనల్​ సెమినార్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  పటాన్​చెరు పరిధిలోని గీతం వర్శిటీలో మూడు రోజులుగా కొనసాగిన ఇంటర్నేషనల్​ సెమినార్​ శుక్రవారంతో ముగిసింది. ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్ర్తాల్లో సమగ్ర ధోరణలు అంశంపై నిర్వహించిన ఈ సెమినార్​కు దేశ, విదేశాల నుంచి శాస్ర్తవేత్తలు, ఔషధ నిపుణులు, అంతర్జాతీయ వర్సిటీల ప్రతినిధులు పాల్గొన్ని తమ ఆవిష్కరణలను పంచుకున్మారు. చివరి రోజు ఐఈఎఫ్ఆర్​ ఫౌండర్​ ఉదయ్​ సక్సేనా, ఎన్వేదా థెరప్యూటిక్స్​ వైస్​ ప్రెసిడెంట్​ శ్రీకాంత్ రామచంద్రన్​, దక్షిణ కొరియా నుంచి ప్రొఫెసర్​ గెడ్డా హాజరై ఆరోగ్య సంరక్షణ, ఔషధ ఆవిష్కరణల భవిష్యత్​పై అభిప్రాయాలను వెల్లడించారు. 

సెమినార్​ ఆర్గనైజర్​ ప్రతీక్​పాఠక్​ మాట్లాడుతూ ఈ సదస్సు ప్రపంచ జ్ఞాన సమ్మేళనంగా నిలిచిందని, గొప్ప చర్చలు, పరిశ్రమల భవిష్యత్​ను రూపొందించే సవాళ్లు, అవకాశాలపై అవగాహన పెంపొందించిందని పేర్కొన్నారు. 60 కి పైగా ఎగ్గిబిట్లు, వందకు పైగా పోస్టర్ ప్రదర్శనలు, 15 మంది నిపుణుల ఉపన్యాసాలు, దేశ విదేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్నట్లు తెలిపారు.