
లండన్: డోపింగ్‌కు పాల్పడిన పోలెండ్ స్టార్ ప్లేయర్, వరల్డ్ రెండో ర్యాంకర్ ఇగా స్వైటెక్‌పై ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) కొరడా ఝుళిపించింది. నిషేధిత ట్రిమోటాజిడిన్ ఔషదాన్ని వాడినందుకు నెల రోజుల సస్పెన్షన్ విధించింది. ఆగస్ట్‌లో నిర్వహించిన డోపింగ్ టెస్ట్‌లో ఇగా ఫెయిలైంది. జెట్‌లాగ్, స్లీపింగ్ సమస్యల కోసం తీసుకున్న మెలటోనిన్‌లో ట్రిమోటాజిడిన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తనకు తెలియకుండానే ఈ డ్రగ్ తీసుకున్నట్లు స్వైటెక్ అంగీకరించింది. దీనిపై విచారణ జరిపిన ఐటీఏఐ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రొవిజినల్ సస్పెన్షన్ విధించింది.