
- అంతర్జాతీయ ముఠాలోని ఏడుగురు అరెస్ట్
- ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు
- రూ.2 లక్షల విలువైన 14 చీరలు స్వాధీనం
మియాపూర్, వెలుగు: మాల్స్, షాపుల్లోని సిబ్బంది దృష్టి మరల్చి ఖరీదైన చీరలను కొట్టేస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని ఏడుగురిని మియాపూర్పోలీసులు అరెస్ట్‌చేశారు. రూ.2 లక్షల విలువైన 14 చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, చెవుటూరు, జనారద్రవార, జగ్గయ్యపేట ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వరరావు(40), యశోద(50), తిరుపతమ్మ(38), వెంకటేశ్వరమ్మ(42), రమణ ఆలియాస్రవనక్క(47), సుభాషిణి(39), వెంకటేశ్వర్లు(38) గ్యాంగ్ గా ఏర్పడ్డారు. ఈ నెల 3న మియాపూర్ఫ్రెండ్స్కాలనీలోని చీరల షాపుకు కొందరు వెళ్లారు. ఆ టైంలో షాపు యజమాని బయటికి వెళ్లగా, ఆమె భర్త చీరలు చూపిస్తుండగా తాగడానికి నీళ్లు అడిగారు. అతను లోపలికి వెళ్లి నీళ్లు తెచ్చేలోపు మరికొందరు వచ్చారు.
తర్వాత మీ భార్య వచ్చాక మళ్లీ వస్తామని చెప్పి అంతా షాపు నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చిన యజమాని స్టాక్చెక్చేయగా14 చీరలు కనిపించలేదు. వెంటనే మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిందితులు ఏడుగురిని గుర్తించి అరెస్ట్‌చేశారు.14 చీరలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.
ఏడుగురే కాదు.. దాదాపు 100 మంది
కృష్ణా జిల్లాకు చెందిన చీరల గ్యాంగ్‌లో దాదాపు 100 మంది సభ్యులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. వీరందరూ కారులో ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడులోని వివిధ జిల్లాలు తిరుగుతూ తక్కువ మంది సిబ్బంది ఉన్న మాల్స్, షాపులను టార్గెట్చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నెలలో 4 నుండి 5 చోరీలు చేస్తున్నారన్నారు. చోరీ అనంతరం ఏదో ఒక గుడికి వెళ్లి, తర్వాత ఒక్కో చీరను రూ.2 వేల నుంచి రూ.10వేలకు అమ్మి పైసలు పంచుకుంటున్నారని తెలిపారు.
గ్యాంగ్‌లోని సభ్యులు 30 ఏండ్లుగా చీరలు చోరీ చేస్తున్నారని, ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని చెప్పారు. వెంకటేశ్వరావు ఐదు సార్లు అరెస్ట్ అయ్యాడని, మహిళల వెంట వెళ్లి భర్తగా నటిస్తాడని తెలిపారు. యశోద అనే మహిళ1985 14 కేసుల్లో, తిరుపతమ్మ 10 కేసుల్లో, వెంకటేశ్వరమ్మ 10 కేసుల్లో, సుభాషిణి 7 కేసుల్లో, రవనక్క 3 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు.