మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీల్లో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కొత్తూరుకు చెందిన క్రీడాకారిణి అన్నపురెడ్డి లిషితారెడ్డి సత్తాచాటింది. ఈనెల 28న తమిళనాడులోని హోసూర్‌లో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలు నిర్వహించారు.
మహిళా విభాగంలో ఇండియా –-శ్రీలంక దేశాల మధ్య త్రోబాల్పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఇండియా టీం విజయం సాధించింది. ఇండియా తరఫున 14 మంది క్రీడాకారులు పాల్గొనగా, తెలంగాణ నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. ఇందులో సూర్యాపేట జిల్లా నుంచి కొత్తూరుకు చెందిన అన్నపురెడ్డి లిషితారెడ్డి పాల్గొంది. చింతలపాలెం మండలంలోని సీతా మెమోరియల్ స్కూల్ లో లిషితారెడ్డి విద్యనభ్యసించింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని సీఎంఆర్ లో బీటెక్ చదువుతోంది.