సాగర్‌‌‌‌ బుద్ధవనంలో త్రిపిటక పఠనోత్సవం.. హాజరైన అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు

సాగర్‌‌‌‌ బుద్ధవనంలో త్రిపిటక పఠనోత్సవం.. హాజరైన అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు

హాలియా, వెలుగు : సికింద్రాబాద్‌‌‌‌కు చెందిన లైఫ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బుద్ధ దమ్మ ఫౌండేషన్‌‌‌‌, తెలంగాణ టూరిజం డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌లో అంతర్జాతీయ త్రిపిటక పఠనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 115 మంది అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థూప వనంలో నిర్మించిన బౌద్ధ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు.

కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌‌‌, బుద్ధవనం రూపశిల్పి చెన్నూరు ఆంజనేయరెడ్డి, అంతర్జాతీయ త్రిపిటక పఠన మండలి వ్యవస్థాపకరాలు వాంగ్‌‌‌‌ మే డిక్సీ, మహా బోధి బుద్ధ విహార సీనియర్‌‌‌‌ బౌద్ధాచార్యుడు ఆనంద బంతే, భిక్షువులు బుద్ధ పాల, సంఘ పాల, థాయిలాండ్‌‌‌‌కు చెందిన ప్రసుబన్‌‌‌‌ ఖసియాంగు, ప్రపలాద అమూల్‌‌‌‌ పోల్మన్‌‌‌‌, కంబోడియాకు చెందిన ధర్మసిరి, వియత్నాంకు చెందిన హూ యన్‌‌‌‌మిన్‌‌‌‌దాన్‌‌‌‌, లావోసుకు చెందిన ఎనాయ్ బౌలాఫి పాల్గొన్నారు.