ఈ ఏడాది (2025) అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్​ ఇదే..!

ఈ ఏడాది (2025) అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్​ ఇదే..!

మహిళల సాధికారతను చెప్పే విధంగా అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని  మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. అసలు ఈ స్పెషల్ డేని ఎందుకు జరుపుతున్నారు.. దాని వెనుకున్న ప్రాముఖ్యత, చరిత్ర ఏంటి? ఈ ఏడాది  ( 2025) థీమ్ ఏంటి వంటి.. ఎలా దీనిని సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. వివిధ రంగాల్లో  మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్​ జరుపుకుంటారు.  అంతే కాకుండా ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వేదికగా పనిచేస్తుంది.. లింగ సమానత్వం గురించి అవగాహన కల్పిస్తూ.. మహిళా సాధికారతకు మద్ధతు ఇస్తూ.. దీనిని ప్రతి ఏటా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. 

ప్రతి ఏడాది ఓ కొత్త థీమ్​తో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ( 2025) .. 'Accelerate Action' అనే థీమ్​తో వస్తున్నారు. మహిళల పురోగతికి హెల్ప్ చేసే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి.. వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఇది చెప్తుంది. అలాగే అన్ని రంగాల్లో లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం, మహిళలకు సాధికారత కల్పించడంపై ఇది అవగాహన కల్పిస్తుంది.ఈ ఏడాది (2025)  మార్చి 8వ తేదీశనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. 

ALSO READ | Holy 2025: హోలీ స్వీట్..​ బెంగాలీ గుజియా స్వీట్​ .. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా..!

మహిళల విజయాలను గుర్తించి.. వాటిని తెరపైకి తీసుకొస్తూ సత్కరిస్తారు. వారిని ఎగ్జాంపుల్​గా చూపిస్తూ.. సక్సెస్​ఫుల్​గా, భయం లేకుండా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాలో అవగాహన కల్పిస్తారు. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న మహిళలకు దక్కాల్సిన చట్టాలు, భద్రతా ఏమిటో అవగాహన కల్పిస్తారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు. అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో చెప్తూ అవగాహన కల్పిస్తూ.. సభలు నిర్వహిస్తారు..

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను రక్షించేం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు . చట్టపరంగా రక్షణ కల్పించడంలో  మహిళల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదికలపై చర్చిస్తారు. అందుకే ఈ స్పెషల్ డేకు ప్రపంచవ్యాప్తంగా విభిన్న దేశాల నుంచి మహిళలకు మద్ధతనందిస్తారు.