గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 9వ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా చేగూర్లోని కన్హా శాంతి వనంలో జరిగిన యోగా దినోత్సవంలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ చీఫ్ గెస్టుగా పాల్గొన్నారు. సుమారు 3 వేల మంది దివ్యాంగులు ఆసనాలు వేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఎల్ఐసీ ఆఫీసులో జోనల్ ట్రైనింగ్ క్యాంపస్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ – ఆంగన్ యోగా’ థీమ్‌తో వేడుకలు నిర్వహించారు. ఎల్ఐసీ సీనియర్ అధికారులు సతీశ్ బాబు, రవికుమార్, రామయ్య, రాజీవ్, మధుసూదన్ పాల్గొన్నారు. అత్తాపూర్‌లోని లక్ష్మీనగర్‌లో నిర్వహించిన యోగా వేడుకల్లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
బన్సీలాల్ పేట మెట్లబావి వద్ద, గాంధీనగర్‌లోని సమతాభవన్లో,సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిగ్నల్ ఇంజనీరింగ్ ఆఫీసులో, ఇఫ్లూ వర్సిటీ, ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద, కూకట్‌పల్లిలోని పీఎన్ఎం స్కూల్లో, చర్లపల్లి సెంట్రల్ జైలు, గాంధీ హాస్పిటల్, బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీ, రాజేంద్రనగర్‌లోని అగ్రి వర్సిటీ, హిమాయత్‌సాగర్‌లోని పోలీస్ అకాడమీలో, ఇబ్రహీంపట్నంలోని జ్ఞానసరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్‌లో యోగా వేడుకలు నిర్వహించారు.
– వెలుగు,హైదరాబాద్/ ఘట్ కేసర్/ ముషీరాబాద్/సికింద్రాబాద్/పద్మారావునగర్/మూసాపేట/కుషాయిగూడ/శంషాబాద్/గండిపేట/షాద్‌నగర్