
ఏ దేశ పురోగతి అయినా ఆ దేశ యువత(Youth )పైనే ఆధారపడి ఉంటుంది. యువశక్తిని మించిన శక్తి ..ఈ భూమండలం మీద ఏదీ లేదనేది వాస్తవం. దేశాభివృద్ధిలో.. పురోగతిలో.... యువత కీలక పాత్ర పోషిస్తోంది. యూత్‌కు బలం, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పులను నడిపించే సామర్థ్య ఉన్నాయి. నేడు ( ఆగస్టు 12) అంతర్జాతీయ యువజన దినోత్సవం. అసలు ఈ దినోత్సవం ఎలా మొదలైందో తెలుసుకుందాం....
అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని(International Youth Day 2023) ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమంపై యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని(International Youth Day) ప్రకటించింది. 1998లో లిస్బన్‌లో జరిగిన వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్‌లో ఇంటర్నేషనల్ యూత్ డే నిర్వహించాలని నిర్ణయించారు. అలా 1999లో ఆగస్టు 12ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. సమాజంలోని వివిధ రంగాలలోని యువకుల అపారమైన సామర్థ్యాన్ని, విలువైన సహకారాన్ని గుర్తించేందుకు యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. 21వ శతాబ్దపు ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా యువనాయకులు తమ గొంతులను ఏకం చేసేందుకు ఈ అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అన్ని దినోత్సవాల మాదిరిగానే యూత్ డేను కూడా నిర్వహించడం వల్ల యువత దృష్టిని ఆకర్షించవచ్చని ఐక్యరాజ్య సమితి ఈ యూవ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
2023 అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని(International Youth Day 2023 ) గ్రీన్ స్కిల్స్ టువర్డ్స్ ఎసస్టైనబుల్ వరల్డ్ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. యువకులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు సరైన మార్గం ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి అన్ని దేశాలకు సూచించింది. యువతకు సంబంధించిన సమస్యలపై అవగాహన పెంచడమే ఈ ఏడాది లక్ష్యమని ప్రకటించింది. యువత బాధ్యతలు, శక్తిని అంతర్జాతీయ యువజన దినోత్సవం గుర్తు చేస్తుంది. విద్య, ఉపాధి, మానసిక శ్రేయస్సు, పేదరికం, సామాజిక చేరికలతో సహా ప్రపంచ స్థాయిలో యువత ఎదుర్కొనే విస్తృత-శ్రేణి సవాళ్లకు సంబంధించి అవగాహనను పెంపొందించడం ఇంటర్నేషనల్ యూత్ డే అసలు లక్ష్యం.
1998లో లిస్బన్‌లో జరిగిన వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ జ్ఞాపకార్థం ఈ తేదీని గుర్తించింది. 21వ శతాబ్దపు ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా యువనాయకులు తమ గొంతులను ఏకం చేయడం చూసిన ఒక సమావేశం ఇదే. ఇతర రాజకీయ అవగాహన దినోత్సవాల మాదిరిగా ఈ దినోత్సవమును జరుపుకోవడం వలన యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని భావించి దీనిని తీసుకువచ్చారు. యువత ఎప్పుడూ కీలకం. వారు ఎల్లప్పుడూ మార్పుకు ఏజెంట్లుగా ఉంటారు. తాజా దృక్కోణాలు, ఆవిష్కరణలను ప్రతిధ్వనిస్తారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఈ స్వరాలను విస్తరింపజేస్తుంది. మన సమాజాన్ని రూపొందించడంలో యూత్ ముందుంటారు కాబట్టి ఈ రోజును ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.