రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలో మూడవ రోజు అంతర్జాతీయ యువ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా టూరిజం కల్చరల్ మంత్రి జూపల్లి కృష్ణారావు, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు...ఈ సమ్మేళనంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.... ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత హాజరవ్వడం గొప్ప విషయమన్నారు.
ప్రస్తుతం సమాజంలోని సమస్యలకు మనుష్యుల ఆలోచనలే కారణం అన్నారు. మెడిటేషన్ ద్వారా మనుషుల్లో ప్రశాంతతతో మంచి ఆలోచనలు వస్తాయన్నారు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. యువత మానవత్వం, సమానత్వం, దయాగుణాలు అలవర్చుకోవాలన్నారు. యువత తల్చుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలదాన్నారు. కన్హా భూమి అద్భుత ప్రదేశమన్నారు.
ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతు... కన్హా శాంతి వనం కారణంగా ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. రామచంద్ర మిషన్ వారు ఇక్కడ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఇంత పెద్ద మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. ప్రభుత్వం తరపున కన్హాకు అన్నీ విధాలుగా సహాయ సహకారాలుంటాయిన్నారు. ఈ సమ్మేళనం కన్హా అధ్యక్షులు దాజి ఆధ్వర్యంలో మూడు జంటలు వివాహ బందంతో ఒక్కటయ్యారు. ఇందులో రెండు జంటలు కొరియన్ జంటలు కాగా, ఒక జంట తెలంగాణ కు చెందిన వారున్నారు.