చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశం భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఈ ఘనత అమెరికా, చైనా,సోవియట్ యూనియన్ సాధించింది. చంద్రయాన్ 3 సక్సెస్ తో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. చిన్న పెద్ద తేడాలేకుండా అందరూ సంబరాల్లో మునిగి తేలారు. దేశ ఖ్యాతిని చాటిన ఇస్రో శాస్త్ర వేత్తలకు విషెష్ చెప్పారు.
మరోవైపు చంద్రయాన్ 3 ల్యాండింగ్ సక్సెస్ చేసి అద్భుత ఘతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల టీం కూడా తమ విజయాన్ని డ్యాన్సులతో ఆస్వాదించారు. ఈ సక్సెస్ వెనక కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తలు కూడా తమదైన శైలీలో విజయోత్సవాలు జరుపుకున్నారు. భారతీయ సాంప్రదాయ పద్దతిలో చక్కటి చీర కట్టుతో అందరూ కలిసి చంద్రయాన్ 3 సక్సెన్ సంబరాలు జరుపుకున్నారు. మహిళా సైంటిస్టుల చీరకట్టు సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.