నెట్‌‌‌‌లింక్స్ రూ.85 కోట్ల సేకరణ

నెట్‌‌‌‌లింక్స్ రూ.85 కోట్ల సేకరణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇంటర్నెట్ సర్వీస్‌‌‌‌లను అందించే నెట్‌‌‌‌లింక్స్‌‌‌‌ రూ.85 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ షేర్లను ఇష్యూ చేయనుంది. కోటి వారెంట్లను ఇష్యూ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వారెంట్లను ఫేస్ వాల్యూ రూ.10 ఉన్న ఫుల్లీ పెయిడప్ షేర్లుగా మార్చుకోవచ్చు. ఒక్కో షేరుని రూ.85 దగ్గర అమ్మనుంది. షేర్లను నాన్ ప్రమోటర్ ఇన్వెస్టర్లకు ఇష్యూ చేయనున్నారు. 25 శాతం అమౌంట్‌‌‌‌ను ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 75 శాతం అమౌంట్‌‌‌‌ను షేర్లు ఇష్యూ అయ్యాక చెల్లించాలి.