తినటానికేనా : ఈ బర్గర్ ధర రూ.4.50 లక్షలు.. ఏం బంగారంతో చేశారా ఏంటీ..!

తినటానికేనా : ఈ బర్గర్ ధర రూ.4.50 లక్షలు.. ఏం బంగారంతో చేశారా ఏంటీ..!

బర్గర్ అంటే ఏ 30, 40 రూపాయలు ఉంటుంది.. అదే స్పెషల్ బర్గర్ అయితే ఏ 100, 200 రూపాయలు.. అదే బర్గర్ వెయ్యి, 2 వేలు అంటే అమ్మో అని నోరెళ్లబెడతాం.. అలాంటి బర్గర్ 4 లక్షల 50 వేల రూపాయలు అంటే.. ఏంటీ అవాక్కయ్యారా.. నమ్మశక్యంగా లేదా.. బర్గర్ ఏంటీ.. 4 లక్షల 50 వేల రూపాయలు ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. అవును.. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బర్గర్ ధర అదే.. ఇందులో స్పెషల్ ఏంటీ.. ఎందుకు ఇంత ధర.. 4 లక్షల 50 వేల రూపాయలతో తయారయ్యే బర్గర్ లో ఏముంటుందీ అనేది ఓసారి తెలుసుకుందామా...

ప్రపంచంలోనే కాస్ట్ లీ బర్గర్ ఇది. ఇటీవల గిన్నీస్ బుక్ లోనూ రికార్డ్ సృష్టించింది. ధరలోనే కాదు రుచిలోను  టేస్ల్ అదిరిపోయిందంట. దీని  అద్భుతమైన రుచి అరుదైన పదార్థాల కలయిక వల్ల దీనికి  ప్రత్యేకత వచ్చిందంట. తీపి, పులుపు, చేదు, ఉమామి రుచుల వల్ల బర్గర్ టేస్ట్ గా ఉంటుందంట. 

Also Read:ఫిలాసఫీ : జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవటం కాదు.. ప్రతిక్షణం విలువైనదే..!

ఈ బర్గర్ తయారీలో   వాగ్యూ బీఫ్‌తో పాటు, సున్నితమైన కావ్యార్, రుచికరమైన కింగ్ క్రాబ్ పొరలు ఉంటాయి. దీని బన్నులు,  ఉల్లిపాయల రింగ్స్ కూడా సాధారణమైనవి కాదు. డోమ్ పెరిగ్నాన్‌తో నింపబడిన షాంపైన్‌తో తయారు చేయబడ్డాయి. ప్రత్యేకత ఏంటంటే.. ఈ బర్గర్ పై పొరను బంగారు రేకులతో అలంకరించారు.  ఇన్ని ప్రత్యేకతులున్న బర్గర్  చాలా మంది నుంచి ప్రశంసలు అందుకుంది.

అయితే ఈ బర్గర్ ను అంత ధర పెట్టి తయారు చేయడం చాలా మందికి నచ్చలేదు. దీనిపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ప్రపంచంలో ఆకలి, పేదరికం వంటి తీవ్రమైన సమస్యలతో బాదపడుతున్నప్పుడు ఇంత కాస్ట్ లీ బర్గర్లు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. 

అయితే ఈ బర్గర్ ను నెదర్లాండ్ లో రాబర్ట్ జాన్ డి వెన్ అనే  చెఫ్ తయారు చేశారు.  కొవిడ్ టైం అతనికి ఈ  ఆలోచన వచ్చిందంట. అతని ఆలోచన  రికార్డుల కోసం కాకుండా ఆకలితో ఉన్నపేదవాళ్లను ఆదుకోవడమంట. ఎలాగంటే.? ఈ బర్గర్ అమ్మకం వల్ల వచ్చిన డబ్బుతో చెఫ్ రాబర్ట్   వెయ్యి ఆహార ప్యాకెట్లను పేదలకు అందించారు.