కివీస్‌ను ఏడిపించేస్తున్నారు: న్యూజిలాండ్ ఫ్యాన్స్‌ను బాధిస్తున్న భారత్ విజయం

కివీస్‌ను ఏడిపించేస్తున్నారు: న్యూజిలాండ్ ఫ్యాన్స్‌ను బాధిస్తున్న భారత్ విజయం

ఆఫ్ఘనిస్తాన్, భారత్ ల భారత్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన మజా అందించింది. మ్యాచ్ టై కావడంతో పాటు సూపర్ ఓవర్ కూడా టై గా ముగిసింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలి సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ 16 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయగా.. ఇండియా కూడా 16 రన్స్ చేసింది.  రెండో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఇండియా 5బాల్స్‌‌కు 11 రన్స్‌‌‌‌‌‌‌‌కు రెండు వికెట్లు (ఆలౌట్) కోల్పోయింది. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ 12 రన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్ లో తొలి మూడు బంతులకు బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ నబీని, రహ్మనుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో అఫ్గాన్ ఒకే రన్‌‌‌‌‌‌‌‌ చేసి ఓడింది.
 
ఈ మ్యాచ్ భారత్ విజయం సాధించడంతో ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టును సోషల్ మీడియాలో తెగ ఏడిపించేస్తున్నారు. ముఖ్యంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ మీద తెగ జాలి చూపిస్తున్నారు. ఇంతకీ భారత్ గెలుపుకు న్యూజిలాండ్ ను ట్రోల్ చేయడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.   
              
అసలేం జరిగిందంటే..?
  
ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ ఎంత థ్రిల్లర్ ని తలపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్ ఫైనల్ అన్నింటిలో  ఇదే బెస్ట్ ఫైనల్ అనడంలో అతిశయోక్తి లేదు. లార్డ్స్ లో జరిగిన ఈ  ఫైనల్ గెలిచేందుకు ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తమ శక్తికి మించి పోరాడాయి. కానీ విజయం మాత్రం ఇంగ్లాండ్ నే వరించింది. అయితే ఈ మ్యాచ్ న్యూజిలాండ్ మాత్రం ఓడిపోయిందని చెప్పలేం. ఐసీసీ అప్పటికప్పుడు తీసుకున్న కొన్ని కారణాల వలన ఇంగ్లాండ్ టైటిల్ ఎగరేసుకుపోయింది. 

సాధారణంగా వన్డే మ్యాచ్ టై అవడం చాలా అరుదు. దశాబ్దానికి ఒకటి రెండు మినహాయిస్తే టై అనే మాట అసలు వినపడదు. కానీ 2019లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేయగా ఛేజింగ్ లో ఇంగ్లాండ్ అంతే స్కోర్ చేసింది. దీంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ కి దారి తీసింది.

అయితే సూపర్ ఓవర్ లో కూడా ఇరు జట్లు 15 పరుగులు చేసినా బౌండరీల లెక్క పద్ధతి ప్రకారం ఇంగ్లాండ్ ని విజేతగా ప్రకటించారు. ఇంగ్లాండ్ మొత్తం 26 బౌండరీలు కొట్టగా.. న్యూజీలాండ్ 17 కొట్టింది. అప్పటికప్పుడు అర్ధం లేకుండా తీసుకున్న ఈ రూల్ కారణంగా కివీస్ జట్టుకి  తీరని అన్యాయం జరిగుందని చాలా మంది క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడ్డారు. 

ఐసీసీపై తీవ్ర విమర్శలు గుప్పించిన తరుణంలో ఈ ఫైనల్ ముగిసిన తర్వాత ఒక కీలక రూల్ ప్రకటించింది. ఇకపై మ్యాచ్ టై అయితే ఫలితం వచ్చేవరకు సూపర్ ఓవర్ ఆడాల్సిందే. అనగా ఒక సూపర్ ఓవర్ టై అయితే మరో సూపర్ ఓవర్, అది కూడా టై అయితే మరొకటి ఇలా ఒక జట్టు గెలిచేవరకు ఫైనల్లో సూపర్ ఓవర్ ఆడుతూనే ఉండాలి. దీంతో అసలైన విజేత ఎవరో బయట పడుతుందని ఐసీసీ చెప్పుకొచ్చింది. 

ఈ రూల్ అప్పుడే ఉండి ఉంటే న్యూజిలాండ్ కు వరల్డ్ కప్ వచ్చేది కదా అని నెటిజన్స్ ఆ దేశంపై సానుభూతి చూపిస్తున్నారు. అప్పుడు ఒక్క సూపర్ ఓవర్ పెట్టి అప్పటికప్పుడు బౌండరీ కౌంట్ అనే రూల్ ద్వారా కివీస్ కు తీరని అన్యాయం చేశారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తన్నారు. మొత్తానికి నిన్నటి భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 మ్యాచ్.. న్యూజిలాండ్ కు 2019 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మరోసారి గుర్తు చేసింది.