అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
  • 6 కేజీల గంజాయి స్వాధీనం

జగిత్యాల టౌన్, వెలుగు : గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ధర్మపురికి చెందిన కొనుగోలుదారుడిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కేసు వివరాలను గురువారం ఎస్పీ ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. గంజాయి తరలింపు ఘటనలో జులై 4న ధర్మపురి పోలీసులు బత్తిని చందు, గొల్ల వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేయగా దుర్గం రాము పరారీలో ఉన్నాడు.

బుధవారం సాయంత్రం ధర్మపురి ఎస్సై ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిందితుడు రాముతో పాటు ఒడిశాకు చెందిన దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏపీకి చెందిన పురుషోత్తంను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వారి వద్ద 6 కేజీల గంజాయి, మూడు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, రూ.3,500 స్వాధీనం చేసుకున్నారని ఏస్పీ తెలిపారు. డీఎస్పీ రఘుచందర్, ధర్మపురి సీఐ రామనరసింహారెడ్డి, ఎస్సైలు ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.