షాద్ నగర్, వెలుగు: గంజాయి అమ్ముతూ అంతర్ రాష్ట్ర వ్యక్తి పట్టుబడ్డాడు. షాద్ నగర్ ఎక్సైజ్ సీఐ శేఖర్ తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన తరుణ్ జోష్ జైన్ 6 ఏండ్ల కిందట సిటీకి వచ్చి ఫరూఖ్ నగర్ లో కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. అక్కడ కంపెనీల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులను టార్గెట్గా ధూల్ పేట నుంచి గంజాయిని తెచ్చి అమ్మకాలు కొనసాగిస్తున్నాడు.
సమాచారం అందడంతో తరుణ్ జోష్ జైన్ కిరాణ షాపుపై బుధవారం దాడి చేసినట్టు చెప్పారు. 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోగా.. 50 వేల విలువ ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని తెలిపారు.