నిజామాబాద్, వెలుగు : తెలంగాణ, మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో మట్కా నిర్వహిస్తూ ఎంతో మందిని మోసం చేసిన జమీర్‌ను నిజామాబాద్ సిటీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగర ఏసీపీ కిరణ్ కుమార్ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. ఐదేండ్ల పాటు పోలీసులకు చిక్కకుండా జమీర్ మట్కా దందా నడిపేవాడు. మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధా, అకోలా, అమరావతిలో మట్కా నిర్వాహకులతో మంచి సంబంధాలు నెలకొల్పి మట్కా నంబర్లను ముందుగానే తెలుసుకునేవాడు.
దాని ఆధారంగా ఏజెంట్లు, బుకీలను పెట్టుకొని పెద్దఎత్తున మట్కా జూదం నిర్వహించేవాడు. బెట్టింగులు పెట్టి ఇప్పటి దాకా రూ.కోట్లు సంపాదించాడు. బుకీల సహాయంతో కొత్తవారిని మట్కాకు అలవాటు చేసేవాడు. టాస్క్ఫోర్స్టీమ్కు అందిన సమాచారంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. జమీర్ కూడబెట్టిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నామని ఏసీపీ తెలిపారు.