గోదావరిఖనిలో అంతర్రాష్ట్ర  పోలీసుల   మీటింగ్‌‌

గోదావరిఖని, వెలుగు : లోక్‌‌సభ ఎన్నికల నేపథ్యంలో  నక్సల్స్‌‌ కార్యకలాపాలపై  నిఘా పెంచాలని మూడు రాష్ట్రాల పోలీస్‌‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. శనివారం గోదావరిఖనిలోని రామగుండం పోలీస్‌‌ కమిషనరేట్‌‌ లో  తెలంగాణ  ఎస్‌‌ఐబీ డీఐజీ సుమతి ఈ మీటింగ్​ జరిగింది.  

చత్తీస్‌‌ ఘడ్‌‌, మహారాష్ట్ర,  తెలంగాణకు  చెందిన ఎస్‌‌ఐబీ ఆఫీసర్లు, వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికల  నేపథ్యంలో   భద్రతాచర్యలు  కట్టుదిట్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై  చర్చించారు.