కొడుకును కొడుతుంటే తండ్రి ప్రభాస్ ఎంట్రీ.. నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

ఇక తాజాగా సలార్ నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ఇంటెర్వేల్ బ్లాక్ ఎక్స్ట్రార్డినరీ లెవల్లో ప్లాన్ చేశాడట ప్రశాంత్. దాదాపు 2000 మందితో ఉండనున్న ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలువనుందని టాక్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ యాక్షన్ సీన్ లో ప్రభాస్ 2000 మందితో ఫైట్ చేస్తుంటే.. అతని కాపాడటానికి తండ్రి ప్రభాస్ ఎంట్రీ ఇస్తారట. తన కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తున్న వారిని వీరలెవల్లో ఇరగొట్టేస్తాడట ప్రభాస్. ఈ ఎపిసోడ్ అంతా గూస్బంప్స్ తెప్పించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోతోంది. ఆ సీన్ ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వినడానికే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తున్న ఈ సీక్వెన్స్ సినిమాల ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే.

ఇక సలార్ సినిమా విషయానికి వస్తే.. శృతి హాసన్(Shruthu haasan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మళయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్(Prudhviraaj sukumaran) విలన్ గా చేస్తున్నారు. జగపతి బాబు(Jagapathi babu) మరో కీలక రోల్ కనిపించనున్న ఈ సినిమాకు రవి బాసృర్(Ravi basrur) సంగీతం అందిస్తుండగా.. హోంబలే ఫిలిమ్స్(Hombale Films) బ్యానర్ పై విజయ్ కిరగందూర్(Vijay kiragandur) నిర్మిస్తున్నారు.