నచ్చిన సినిమానో, సీరియలో చూస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడిస్తేనే కస్సుబుస్సుమంటాం. అలాంటిది ఇంట్రెస్టింగ్ సీన్ దగ్గర వీడియో బఫరింగ్ అయితే.. ఆ ఫ్రస్ట్రేషన్‌ని మాటల్లో చెప్పలేం. వీడియో క్వాలిటీ ‘లో’ ఉంటే ఆ బాధ ఇంకోరకం. ఈ సమస్య వచ్చినప్పుడల్లా ఒకటికి వందసార్లు ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేస్తుంటారు అంతా. కానీ, ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ప్రతిసారి బఫరింగ్కి ఇంటర్నెట్ కారణం కాదు. స్ట్రీమింగ్ ప్రొవైడర్స్ కూడా ఈ సమస్యకి కారణం కావొచ్చు. దీనికి సొల్యూషన్‌గా మార్కెట్లోకి వచ్చిందే మోగీ ఐ/ఓ స్టార్టప్. డిల్లీకి చెందిన విక్రాంత్ ఖన్నా, రాహుల్ లహోరియా అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఈ స్టార్టప్ పెట్టారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్నూ వీళ్లు తయారు చేసిన యాప్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు వర్చువల్ గిఫ్టింగ్ యాప్‌ని కూడా డిజైన్ చేశారు ఈ ఫ్రెండ్స్.
రెండేళ్ల కిందట రాహుల్ ఖన్నా హోమ్షాప్18 కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసేవాడు. అదే టైంలో భారతీ ఎయిర్‌టెల్‌కి కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్ అండ్ డిజిటల్ టీమ్‌లోనూ వర్క్ చేశాడు. అక్కడే ఎంట్రప్రెనూర్ రాహుల్ పరిచయమయ్యాడు. కొద్దిరోజుల్లోనే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ్నించి వాళ్లిద్దరి ఆలోచనలు బిజినెస్ వైపు మళ్లాయి. కొరియన్ వర్చువల్ గిఫ్టింగ్ యాప్ కాకోటాక్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఆ కాన్సెప్ట్‌తో మన దగ్గరా ఒక యాప్ లాంఛ్ చేయాలనుకున్నారు వీళ్లు. అలా వచ్చిందే వర్చువల్ గిఫ్టింగ్ యాప్ ‘బూమగిఫ్ట్’. రెండేళ్లలోనే పదమూడు కోట్ల బిజినెస్ చేసింది ఈ యాప్. ఆ ఇన్స్పిరేషన్తో యాప్‌ని మరింత డెవలప్ చేయాలనుకున్నారు ఈ ఇద్దరు.
ఆ ఆలోచనే...
వర్చువల్ గిఫ్టింగ్ యాప్‌లు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. వాటన్నింటిని దాటి యూజర్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే యాప్‌ని మరింత యునిక్‌గా డిజైన్ చేయాలి. ఇదే ఆలోచనతో ‘బూమగిఫ్ట్’ యాప్‌నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే షార్ట్ ఫార్మాట్ వీడియో యాప్‌గా మార్చాలనుకున్నారు. దాన్ని మోగి ఐ/ఓ పేరుతో మార్కెట్లోకి తీసుకురావాలనుకున్నారు. ఆలోచనకి తగ్గట్టుగానే యాప్ రీస్ట్రక్చర్ ప్రాసెస్‌ని మొదలుపెట్టారు. కానీ, అడుగడుగునా టెక్నికల్ సమస్యలు వచ్చాయి. వీడియో బఫరింగ్, లో క్వాలిటీ వాళ్లని బాగా ఇబ్బంది పెట్టాయి. ఎక్స్పర్ట్స్ కూడా ఈ సమస్యకి పర్మినెంట్ సొల్యూషన్ ఇవ్వలేకపోయారు. దాంతో మార్కెట్లోని స్ట్రీమింగ్ యాప్స్ ఎదుర్కొంటున్న టెక్నికల్ సమస్యలన్నీ బాగా అర్థమయ్యాయి వీళ్లకి. వాటన్నింటికి సొల్యూషన్ వెతుకుతూ రీసెర్చ్ మొదలుపెట్టారు. ఆ ప్రాబ్లమ్స్‌కి ఆన్సర్‌గా మోగి ఐ /ఓ స్టార్టప్‌ని తీసుకొచ్చారు. ఆ ఆలోచనే ఇప్పుడు కోట్లు కురిపిస్తోంది.
ఏం చేస్తుంది?
బెయిన్ అండ్ కంపెనీ స్టడీ ప్రకారం గత రెండేళ్లలో మన దేశంలో వీడియోలు చూసేవాళ్ల సంఖ్య 24 శాతం పెరిగింది. వాళ్లకి తగ్గట్టే కంటెంట్ కూడా పెరుగుతోంది. దానివల్ల వరల్డ్ వైడ్‌గా ఇంటర్నెట్ ఫాస్ట్ డెలివరీకి సాయం చేసే గ్లోబల్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ( సీడిఎన్) ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటోంది. ఇంటర్నెట్ స్లో అవుతోంది. ఆ ఎఫెక్ట్ వల్లే బఫరింగ్, వీడియో లో క్వాలిటీ సమస్యలు. ఈ సమస్యలకు సొల్యూషన్ చూపిస్తుంది మోగి ఐ/ఓ బి2బి ( బిజినెస్ – టు– బిజినెస్) మీడియో టెక్ సాస్ వెంచర్. బఫర్ ఫ్రీ వీడియోలే ఈ స్టార్టప్ మెయిన్ గోల్. అది కూడా హై క్వాలిటీలో. ఈ యాప్ మల్టీ – సీడిఎన్ ఆర్కిటెక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో బఫర్ ఫ్రీ వీడియోలని అందిస్తుంది. అలాగే వీడియోలని 50 శాతం కంప్రెస్ చేస్తుంది. వెబ్‌సైట్స్, యాప్స్‌లోని ఫొటోలని కూడా క్వాలిటీ తగ్గకుండా 80 శాతం వరకు కంప్రెస్ చేస్తుంది.
24 గంటల్లో ..
మోగి ఐ/ ఓ రీసెంట్గా వైట్ లేబుల్ ఓటీటీ సొల్యూషన్స్‌ని కూడా మొదలుపెట్టింది. ప్లగ్ అండ్ ప్లే సాస్ ప్లాట్ ఫాం ద్వారా సొంతంగా ఓటీటీ వీడియో యాప్స్‌ని లాంఛ్ చేసుకునే వెసులుబాటు ఇస్తోంది యూజర్స్‌కి. అంటే ఎవరికివాళ్లు సొంతంగా బ్రాండెడ్ వెబ్సైట్ లేదా ఆండ్రాయిడ్ యాప్స్‌ని క్రియేట్ చేసుకొని కంటెంట్‌ని పోస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మోగి ఐ/ ఓ కొన్ని టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌తో పాటు టీవీలకు, సోషల్ మీడియా యాప్స్‌కు బఫర్ ఫ్రీ స్ట్రీమింగ్ కోసం వర్క్ చేస్తుంది. అలాగే ఫ్యూచర్లో వరల్డ్ క్లాస్ సాఫ్ట్‌వేర్‌తో పాటు వీడియో టెక్ కంపెనీ పెట్టాలనుకుంటున్నారట వీళ్లు. దానివల్ల కోట్లమంది బఫర్ ఫ్రీ వీడియోలని ఎంజాయ్ చేస్తారు..లక్షల మంది ఓటీటీ యాప్స్‌ని క్రియేట్ చేసుకుంటారు అని చెప్తున్నారు ఈ ఫ్రెండ్స్.