చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెపోటు రాకుండా చేయడంతో పాటు మెదడు ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అలాగే పిల్లల్లో ఉబ్బసాన్ని కూడా చేపలు తగ్గిస్తాయని చాలా అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు చేసిన స్టడీలో చేపలతో క్యాన్సర్కి చెక్ పెట్టొచ్చని వెల్లడైంది. వారానికి ఒకసారి చేపల్ని తినేవాళ్లతో పోలిస్తే వారానికి మూడు సార్లు తినేవాళ్లలో పేగు క్యాన్సర్ 12 శాతం తక్కువగా ఉందని ఆ పరిశోధనల్లో తేలింది.
ఇదీ అదీ అని కాకుండా... అన్ని రకాల చేపలను తీసుకోవడం మంచిదే. కానీ ఆయిల్ ఎక్కువగా ఉండే సాల్మన్, మాకరెల్ చేపల కంటే ఇతర చేపల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. అయితే అందరికీ ఇవే రకమైన చేపలు అందుబాటులో ఉండవు కాబట్టి ఏ రకం చేపలనైనా తినొచ్చు. చేపల్లో ఉండే కొవ్వు, ఆమ్లాలు శరీరంలోని వాపులను తగ్గించి, క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. రోజువారీ అందుకే రోజు చేపల్ని తింటే మంచిదని ఈ స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్ మార్క్ గుంటర్ చెప్తున్నారు.