Kannappa: కన్నప్ప అప్డేట్.. అడివిని పీడించే అరాచకం మారెమ్మ!.. ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్

Kannappa: కన్నప్ప అప్డేట్.. అడివిని పీడించే అరాచకం మారెమ్మ!.. ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa) నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో వర్క్ చేస్తున్న ప్రతి క్యారెక్టర్ కి సంబంధించి నటీనటుల లుక్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై  మరింత హైప్ పెంచేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే మధుబాల, దేవరాజ్, ముఖేష్ రేషి, మంచు అబ్రామ్, అర్మిత్, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్ విడుదల చేశారు. లేటెస్ట్ గా మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. సీనియ‌ర్ న‌టి ఐశ్వ‌ర్య (Aishwarya) మారెమ్మ లుక్లో అందరినీ భయపట్టేలా ఉన్నారు.

మేకర్స్ ఆమెకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.."అడివిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం' అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.ఇప్పుడు ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మీరూ చూసేయండి.

కాగా..అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహ‌న్‌బాబు నిర్మిస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

  • Beta
Beta feature