బ్లింకిట్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారా..? ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది..!

బ్లింకిట్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారా..? ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది..!

జొమాటో సంస్థకు చెందిన క్విక్ కామర్స్ కంపెనీ బ్లింకిట్ కస్టమర్స్ కోసం ఒక కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక ప్రొడక్ట్ను కస్టమర్కు డెలివరీ చేసిన 10 నిమిషాల్లోనే ఎక్సేంజ్ లేదా రిటర్న్ చేసే అవకాశాన్ని వినియోగదారులకు బ్లింకిట్ కల్పించింది. దుస్తులు, చెప్పులు, షూస్.. ఇలా ఫ్యాషన్ రంగానికి చెందిన కొన్ని ఉత్పత్తులపై ఈ 10 నిమిషాల రిటర్న్ లేదా ఎక్సేంజ్ పాలసీ వర్తిస్తుంది. ఎంత సైజ్ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసినా కొన్ని సందర్భాల్లో చెప్పులు, షూస్, దుస్తులు.. సైజ్ సరిపోకపోవడమో లేదా ఫిట్ అవకుండా లూజ్ అవడమో జరుగుతుంటుంది.

 

ఇలా.. ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ ఫిట్ అవలేదనిపించి రిటర్న్ లేదా ఎక్సేంజ్ చేస్తే మళ్లీ సరైన ప్రొడక్ట్ మన చేతికొచ్చేసరికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అదే బ్లింకిట్లో అయితే 10 నిమిషాల్లోనే ఎక్సేంజ్ లేదా రిటర్న్ పెట్టేసేయొచ్చు. ప్రధానంగా సైజ్ విషయంలో ఆ ప్రొడక్ట్ ఫిట్ అవని పరిస్థితుల్లో ఈ క్విక్ రిటర్న్ లేదా ఎక్సేంజ్ పాలసీ వినియోగదారులకు చాలా మేలు చేస్తుంది. బ్లింకిట్ ఈ పాలసీకి ‘‘ఈజీ రిటర్న్స్’’ అని పేరు పెట్టింది. ప్రస్తుతానికి ఈ ‘ఈజీ రిటర్న్స్’ ఫీచర్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, హైదరాబాద్ నగరాల్లో బ్లింకిట్లో ఆర్డర్ చేసే కస్టమర్స్కు అందుబాటులో వచ్చింది. ఇతర నగరాలకు త్వరలో విస్తరించనున్నట్లు బ్లింకిట్ తెలిపింది.

ఒకప్పుడు క్విక్ కామర్స్ యాప్స్లో కేవలం కిరాణా సరుకులు, నిత్యావసరాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు గృహోపకరణాలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్.. ఇలా పలు ఉత్పత్తులను క్విక్ కామర్స్ యాప్స్ అయిన జెప్టో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ విక్రయిస్తుండటం విశేషం. బ్లింకిట్కు పోటీ కంపెనీ అయిన జెప్టో (Zepto) కూడా దుస్తులకు సంబంధించిన ఉత్పత్తులపై 72 గంటల ఎక్సేంజ్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. Zeptoలో ఆర్డర్ చేసిన అప్పరెల్ ఐటమ్స్ (దుస్తులకు సంబంధించిన ఉత్పత్తులు) డ్యామేజ్ అయినా, డిఫెక్టివ్ ప్రొడక్ట్ డెలివరీ చేసినా 72 గంటల్లో ఎక్సేంజ్ పెట్టేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు