చిన్నప్పుడే యాక్టింగ్‌తో కట్టిపడేసింది ఈ అమ్మాయి. టీనేజ్ లవ్‌స్టోరీలో బెస్ట్ పెయిర్ అనిపించుకుంది. సినిమా సినిమాకి గ్యాప్ వస్తేనేం? నటనలో ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఆమె నటించిన పాత్రల్లో ప్రతీది ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఆడియెన్స్‌ని తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్గా మోహన్‌లాల్ నటించిన ‘నేరు’ అనే సినిమాలో అంధురాలి పాత్రలో తన నటనతో మెప్పించింది అనశ్వర రాజన్. ఈ అమ్మాయి గురించి మరిన్ని విషయాలు..
కేరళలోని కరివెళ్లూర్ అనే విలేజ్‌లో ఉండే చిన్న ఫ్యామిలీ మాది. అమ్మానాన్నా, అక్క, నేను. పయ్యనూర్ లోని సెయింట్ మేరీ హై స్కూల్లో చదివా. ఈ ఇండస్ట్రీకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను మోనో యాక్ట్ బాగా చేస్తా. స్కిట్స్, నాటకాల్లో చేసేదాన్ని. మా ఫ్యామిలీ ఫ్రెండ్ డైరెక్టర్ లిజు థామస్. ఆయన ‘కవి ఉదేశిచతు’ అనే అడ్వర్టైజ్మెంట్ కోసం నా ఆడిషన్ అడిగారు. అప్పుడు నా ఫొటోలు పంపాను. ఫైనల్ ఆడిషన్స్‌కి అరవై మంది వెళ్తే నేను సెలక్ట్ అయ్యా.
ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ మేకప్ మ్యాన్ రతీష్ ‘గ్లోబ్’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. అందులో నటించా. నేను ఆ షార్ట్ ఫిల్మ్ ఆడిషన్‌కి వెళ్లినప్పుడు కెమెరా అంటే భయపడేదాన్ని. డైరెక్టర్ రతీశ్ నన్ను గైడ్ చేశాడు. ఇదంతా పక్కన పెడితే... నేను దుల్కర్ సల్మాన్ ఫ్యాన్. ఆయన నటించిన ‘చార్లీ’ మూవీ నా ఫేవరెట్. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా డ్రీమ్.
ఫస్ట్ ఛాన్స్
‘ఉదాహరణమ్ సుజాత’ సినిమాకి ఆడిషన్స్‌లో సెలక్ట్ అవుతానని నా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నాకయితే ఏ మాత్రం నమ్మకం లేకుండానే ఆడిషన్ ఇచ్చేందుకు వెళ్లా. అక్కడ మూడు సీన్స్ చేసి చూపించమన్నారు. ఆ ఆడిషన్ ఇచ్చి వచ్చిన వారం తర్వాత ‘యు ఆర్ సెలక్టెడ్’ అని మెసేజ్ వచ్చింది. అది చూసి నేను షాక్ అయ్యా. మా అక్క థ్రిల్ ఫీలయింది. మా ఇంట్లో సెలబ్రేషన్స్ జరగబోతున్న వాతావరణం కనిపించింది ఆ క్షణం.
నా మొదటి సినిమా ‘ఉదాహరణమ్ సుజాత’లో మంజువారియర్ కూతురి పాత్ర నాది. మంజువారియర్ని కలవడం నా అదృష్టం. ఆమె నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసేది. ఆమె ప్రశాంతమైన ముఖం చూస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నాకు. సెట్స్‌లో ఉన్నంతసేపు చాలా సరదాగా ఉంటారు. మంజు అక్క నాకు ‘నీర్మంతలం పూతకాలం’ అనే పుస్తకం గిఫ్ట్ ఇచ్చింది. అందులో ‘బెస్ట్ విషెస్ టు అనశ్వర ఫ్రమ్ ఆమి’ అని రాసింది.
ఆ బుక్ నా లైఫ్‌లో దొరికిన నిధి. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ షూటింగ్ మర్చిపోలేను. అది ఎమోషన్ సీన్ అయ్యేసరికి టెన్షన్ పడ్డా. సీన్ మూడ్‌లోకి వెళ్లడానికి డైరెక్టర్ నన్ను రోజంతా సైలంట్‌గా ఉండమన్నారు. మంజు అక్క నా చెయ్యి పట్టుకుని ఎంకరేజ్ చేశారు. మూడో టేక్‌లో సీన్ ఓకే అయింది. డైరెక్టర్ ఫాంటమ్ ప్రవీణ్, ప్రొడ్యూసర్ మార్టిన్ నన్ను చాలా మెచ్చుకున్నారు.
డైరెక్టర్ ప్రవీణ్ షూటింగ్ టైంలో ఎప్పుడూ కోప్పడలేదు. ఒకసారి మాత్రం చాలా టేక్స్ తీసుకున్నా. దాంతో ఆయన దగ్గరకొచ్చి ‘బాగా చెయ్’ అని సీరియస్‌గా అన్నారు. ఆ మాటలు కోపంగా చెప్పినట్లు అనిపించింది. దాంతో నేను చాలా ఫీలయ్యా. ఆ రోజు లంచ్ తినబుద్ధి కాలేదు. తర్వాత ఆయన నన్ను బుజ్జగిస్తే అప్పుడు రిలాక్స్ అయ్యా. ఇంకో సీన్ షూటింగ్ చేస్తున్నప్పడు నాకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది.
దాంతో నేను అప్సెట్ అయ్యి ‘సారీ.. నేను ఇప్పుడు చేయలేనేమో’ అని డైరెక్టర్‌తో చెప్పా. అప్పుడు ఆయన ‘నువ్వు చేయగలవ్. మనం ఈ సీన్ షూటింగ్ రేపు పెట్టుకుందాం. ఫస్ట్ టేక్‌లోనే పర్ఫెక్ట్గా చేస్తావ్. నాకు తెలుసు’ అని ఎంకరేజ్ చేశారు.
మేమంతా కలిసి...
మా స్కూల్ స్టూడెంట్స్ అంతా కలిసి సినిమా చూశాం. సినిమా చూస్తూ నా స్కూల్‌మేట్స్ కళ్లలో వచ్చిన నీళ్లు చూసి నా జీవితంలో మొదటిసారి సంతోషంగా అనిపించింది. ఆ సినిమాలో నేను భాగం అయినందుకు గర్వంగా ఫీలయ్యా. నా ఫ్రెండ్స్ అంతా ఆ సినిమా క్యారెక్టర్ ‘అథిర’కి నాకు డిఫరెన్స్ ఏం లేదు అనేవాళ్లు. ఈ సినిమాలో అథిర క్యారెక్టర్ అంత కాదు కానీ నేను అమ్మతో ఎక్కువగా గొడవపడుతుంటా. త్వరగా నిద్ర లేపడానికి ముఖం మీద నీళ్లు చల్లితే గొడవ పడతా. ఆ సినిమా చూసేటప్పుడు క్లైమాక్స్‌లో మా అమ్మ ఏడ్చేసింది. ‘నేను అలా పర్ఫార్మ్ చేస్తానని ఊహించలేదు. ‘అథిర’ క్యారెక్టర్ నీకు చాలా దగ్గరగా ఉంది’ అని చెప్పింది.
అన్నీ ఛాలెంజింగ్ పాత్రలే!
నేను చేసినవాటిలో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఎక్కువ. నా మొదటి సినిమా ‘ఉదాహరణమ్ సుజాత’లో కోపంగా ఉండే అమ్మాయి రోల్ చేశా. కానీ, నేనేమో స్కూల్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటా. అలాంటిది స్టూడెంట్స్‌తో కోపంగా సీన్ చేయాలంటే కష్టంగా అనిపించింది. సైలంట్‌గా ఉండేదాన్ని కాదు. స్టూడెంట్స్‌తో కలిసి షూటింగ్ చేసినన్ని రోజులు ఎంజాయ్ చేశా. దానికి నన్ను తిట్టారు కూడా. కానీ, సెట్లో ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. ‘ఉదాహరణమ్ సుజాత’ రిలీజ్ అయ్యాక చాలా బిజీ అయిపోయా. ప్రారంభోత్సవాలు, అవార్డ్ ఫంక్షన్లు అంటూ చాలా ప్రోగ్రామ్స్‌కి వెళ్లా. స్కూల్లో ఓ మాదిరి స్టార్ అయిపోయా!
రీసెర్చ్ చేసి...
‘మైక్’ కథ విన్నాక ఆ కాన్సెప్ట్ గురించి నేను చాలా రీసెర్చ్ చేశా. అది జెండర్ రీఎసైన్మెంట్ రోల్. నేను ఏదైనా రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుందా అని చాలా ఆలోచించా. అదీకాక ఇవ్వాళరేపు ట్రోలింగ్ చాలా ఎక్కువ కదా. అందుకే స్క్రిప్ట్ గురించి ప్రతి చిన్న విషయానికి డైరెక్టర్‌కి ఫోన్ చేసి అడిగేదాన్ని. షూటింగ్ జరిగేటప్పుడు కూడా చాలా ప్రశ్నలు వేశా. తెలియకుండా కూడా సొసైటీకి రాంగ్ మెసేజ్ ఇవ్వద్దనేది నా ఉద్దేశం. సినిమాలో ఒక పాత్రలో చేస్తున్నా అంతే. చెడు అభిప్రాయం కలిగించకూడదని బోల్డెంత రీసెర్చ్ చేశా.
‘నేరు’లో చేసిన రోల్ కూడా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే కళ్లు ఉన్నా లేనట్టు చేయడం, అది కూడా విక్టిమ్‌లా. ఈ కథ చెప్పినప్పుడు మోహన్‌లాల్ వంటి పెద్ద యాక్టర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గ్రేట్ అనిపించింది. ‘సారా’ అనే అంధురాలి పాత్ర చేశా. ఆ పాత్ర చేసేందుకు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. ఫైనల్‌గా మంచి రిజల్ట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. క్యారెక్టర్లో ఉండడం చాలా కష్టమైంది.
సినిమాలో మెయిన్ సీన్ షూటింగ్ చేస్తున్నప్పుడు... ఆ తర్వాత దాని గురించి ఆలోచించడం కష్టంగా అనిపించేది. షూటింగ్ అయిపోయాక కూడా సారా పాత్ర లేదా అలాంటి ఒక అమ్మాయి గురించి ఆలోచించినప్పుడు చాలాసేపు మాట్లాడేదాన్ని కాదు . సినిమా అయిపోయాక కూడా సారా నాతోనే ఉంది అనిపించింది.
విమర్శలను, నెగెటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకుండా వెళ్లిపోదామంటే కుదరదు. ఏదో ఒక టైంలో వాటి ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. కొన్నిసార్లు అవి ఒక పెద్ద ప్రాబ్లమ్‌లా తయారవుతాయి. వ్యక్తిగతంగా అంటే... ఆటిట్యూడ్, డ్రెస్సింగ్, నా యాక్టింగ్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తే బాధపడతా. నేను ఫీలయితే అది కరెక్ట్ కాదని చెప్తా.
అవార్డ్స్ :
ఉదాహరణమ్ సుజాత’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘ఫ్లవర్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్.
బెస్ట్ స్టార్ పెయిర్‌గా ‘తన్నీర్ మదన్ దినంగళ్’ మూవీకి 22 ఏసియానెట్ ఫిల్మ్ అవార్డ్.
బెస్ట్ పాపులర్ యాక్ట్రెస్‌గా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్.
బెస్ట్ యాక్ట్రెస్‌గా ‘వాంకు’ మూవీకి ‘మాళవిల్ ఎంటర్టైన్మెంట్స్ అవార్డ్’.