
మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబో నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నేడు (ఏప్రిల్ 1న) Mega157 గ్యాంగ్‌ని పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘మెగా 157’ సినిమా కోసం పనిచేస్తున్న మేకర్స్, టెక్నీషియన్స్ వివరాలను ఈ స్పెషల్ వీడియో ద్వారా ప్రకటించారు.
ఈ మూవీకి పనిచేస్తున్న రైటర్స్, కో రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ వివరాలను అనౌన్స్ చేశారు. భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్గా పనిచేస్తుండగా.. ఆర్ట్ డైరెక్టర్గా AS ప్రకాష్ పనిచేస్తున్నారు.
అలాగే,2026 సంక్రాంతికి మూవీ రిలీజ్ కానున్నట్లు ఈ వీడియో ద్వారా మేకర్స్ తెలిపారు.‘ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’అంటూ వీడియో చివర్లో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఈ లేటెస్ట్ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. తమ అభిమాన హీరో సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఎవరనే వివరాలను నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. గతంలో వీరు పనిచేసిన సినిమాలేంటీ? ఆ సినిమా తాలూకా సక్సెస్ లో వారి పాత్ర ఏంటనేది చర్చించుకుంటున్నారు.
Thank you sir for all the belief ❤️
— Anil Ravipudi (@AnilRavipudi) March 31, 2025
Our gang is ready for this exciting journey 🤗
సౌండ్ పెంచాం 😉, రఫ్ఫాడిద్దాం 🥳 #Mega157 #ChiruAnil https://t.co/UlTU0mLMlu
మెగా157 మూవీ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. మార్చి 30న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమం గ్రాండ్‍గా జరిగింది. ఈ మూవీలో వింటేజ్ చిరూని చూస్తారని అనిల్ చెప్పుకొస్తున్నాడు. మరెలాంటి కథతో వచ్చి మ్యాజిక్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల ఈ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.