నస్పూర్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ కృషి చేస్తోందని శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కార్మికుల సమస్యలను సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారన్నారు. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు.
వారసత్వ ఉద్యోగాలతోపాటు ఇతర ఉద్యోగాలు కల్పనకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, సింగరేణిలో కొత్త గనులు, కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న వేలంలో పాల్గొనడం.. తదితర సమస్యలను సీఎంకు విన్నవిస్తున్నామన్నారు. కార్యక్రమంలో లీడర్లు గరిగ స్వామి, కలవేణ శ్యాం, అశోక్, తిరుపతి, శ్రీనివాస్, మధు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.