బొగ్గు బ్లాక్​ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు : ఐఎన్టీయూసీ

బొగ్గు బ్లాక్​ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు : ఐఎన్టీయూసీ

కోల్​బెల్ట్/నస్పూర్/బెల్లంపల్లి, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వెంటనే  విరమించుకోవాలని, తెలంగాణలోని అన్ని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలని డిమాండ్​చేస్తూ ఐఎన్టీయూసీ ఆందోళనలకు దిగింది. గురువారం మందమర్రి, శ్రీరాంపూర్​సింగరేణి ఏరియాల జీఎం ఆఫీసుల వద్ద ఐఎన్టీయూసీ శ్రేణులు, కార్మికులు వేర్వేరుగా ధర్నాలు చేపట్టారు.

వందేండ్ల చరిత్ర ఉన్న సింగరేణి కంపెనీని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి వేలాది కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఎంఎండీఆర్​ చట్టానికి మద్దతు పలికిన గత బీఆర్​ఎస్ సర్కార్​ఈ వేలాన్ని ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ధర్నాల అనంతరం మందమర్రి, శ్రీరాంపూర్​ఏరియాల జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. ఐఎన్టీయూసీ బెల్లంపల్లి రీజియన్​ ఇన్​ఛార్జ్ ​కాంపెల్లి సమ్మయ్య, మందమర్రి, శ్రీరాంపూర్ ​ఏరియాల వైస్​ప్రెసిడెంట్లు దేవి భూమయ్య, జె.శంకర్​రావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్ల​ ముట్టడిని విజయవంతం చేయాలి

బొగ్గు బ్లాక్​ల వేలాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ లీడర్లు కోరారు. గురువారం మందమర్రి, శ్రీరాంపూర్​ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై గేట్​మీటింగులు నిర్వహించి, పోస్టర్లు ఆవిష్కరిస్తూ ప్రచారం చేశారు. ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, డిప్యూటీ జనరల్​ సెక్రటరీలు కె.వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి బ్రాంచీల సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

ALSO Read : చేపలు పట్టేందుకు లీజు పొడిగించాలని నిరసన

సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు ఛలో కలెక్టరేట్, జీఎం ఆఫీస్​ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామి వెల్లడించారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని ఆవరణలో జరిగిన గేట్ మీటింగ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు.ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు చిప్ప నర్సయ్య,  రత్నం ఐలయ్య,రామచందర్, తిరుపతి గౌడ్, రమేశ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.