కొత్తగూడెం అభివృద్ధిపై పొంగులేటి స్పెషల్ ఫోకస్

 కొత్తగూడెం అభివృద్ధిపై పొంగులేటి స్పెషల్ ఫోకస్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పెషల్​ ఫోకస్​ పెట్టారని ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ ఎండీ. రజాక్​తెలిపారు. కార్మిక వాడల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం మొక్కలు నాటారు.

 పొంగులేటి బర్త్​డే సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఏరియాలోని మైన్స్​, డిపార్ట్​మెంట్లలో కేక్​లు కట్​ చేశారు. అన్నదానాలు నిర్వహించారు. సింగరేణి కార్మికుల సంక్షేమంతో పాటు సంస్థ పురోభివృద్ధికి పొంగులేటి కృషి చేస్తున్నారని రజాక్​ తెలిపారు.