
కోల్బెల్ట్, వెలుగు: కొత్త బొగ్గు బ్లాక్లు కేటాయించి సింగరేణి సంస్థను కాపాడేందుకు చొరవ చూపాలని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్లాల్మీనాను ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో అధికారిక సమావేశానికి హాజరైన కోల్ సెక్రటరీని ఆయన కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి మనుగడ కొత్త బొగ్గు గనులపై ఆధారపడి ఉందని, బొగ్గు బ్లాక్లు కేటాయిస్తే 40 వేల కార్మిక కుటుంబాలను రక్షించడంతోపాటు రాష్ట్ర, దేశ అవసరాలకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉంటుందన్నారు.
2030 నాటికి సింగరేణిలోని పాత గనులు మూతపడి క్లిష్టపరిస్థితులు ఏర్పడనున్నాయన్నారు. భవిష్యత్తులో సింగరేణి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో ప్రజలు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన కోల్సెక్రటరీ సింగరేణి సంస్థను తప్పక రక్షిస్తామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. కోల్ సెక్రటరీ వెంట సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ ఉన్నారు.