చేరికలతో ఐఎన్టీయూసీలో జోష్..వివేక్​ వెంకటస్వామి సమక్షంలో చేరిన లీడర్లు

చేరికలతో ఐఎన్టీయూసీలో జోష్..వివేక్​ వెంకటస్వామి సమక్షంలో చేరిన లీడర్లు

కోల్​బెల్ట్/బెల్లంపల్లి రూరల్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్ల నుంచి ఐఎన్టీయూసీ యూనియన్​లో భారీగా చేరికలు జరిగాయి. సోమవారం మందమర్రి ఏరియాలోని కేకే-5, కాసీపేట1, కాసీపేట2, కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ, ఎస్​అండ్​పీసీ, ఆర్కేపీ సింగరేణి ఏరియా ఆసుపత్రి, సీహెచ్​పీ, సింగరేణి జీఎం ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ప్రచార గేట్​ మీటింగుల్లో ఎమ్మెల్యే డాక్టర్​జి.వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చీఫ్​ గెస్టులుగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా టీబీజీకేఎస్, ఏఐటీయూసీ యూనియన్లకు చెందిన కీలక లీడర్లు, కార్యకర్తలు ఐఎన్టీయూసీలో చేరారు. రామకృష్ణాపూర్​ ఓపెన్​ కాస్ట్​ గనికి చెందిన టీబీజీకేఎస్​సెంట్రల్​కమిటీ మెంబర్ ​ఏడుకోల పవన్, ఏరియా సెక్రటరీలు ఎనగందుల శంకర్, మేడ సమ్మయ్య, కాసీపేట-2 పిట్​సెక్రటరీ కారుకూరి తిరుపతి, ఆర్కేపీ ఓసీపీలో ఫోర్​ మెన్లు రాజ్​కుమార్, మోహన్​, నీలం శ్రీనివాస్​గౌడ్

ఎస్​అండ్​పీసీ విభాగంలో చారి, జగన్నాథ్, ప్రసాద్, సీహెచ్​పీ ఏఐటీయూసీ మాజీ పిట్​ సెక్రటరీ లక్కిరెడ్డి సంజీవ్​, కేకే ఓసీపీలో మహిళా ఉద్యోగులు వివేక్​ వెంకటస్వామి సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరారు. అన్ని గనులపై వందలాదిగా ఉద్యోగులు, కార్మికులు చేరడంతో ఐఎన్టీయూసీలో జోష్​నిండింది. ఐఎన్టీయూసీ యూనియన్​ గెలుపుపై ధీమా పెరిగింది. 

సమస్యలపై వినతులు

మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులపై ఎన్నికల ప్రచారం చేసిన వివేక్ వెంకటస్వామికి సమస్యలపై పలు వినతులు అందాయి. రామకృష్ణాపూర్​ ఓపెన్ ​కాస్ట్ గని జీవితకాలం పెంపుదల, కేకే ఓసీపీ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ వర్తింపు, కాంట్రాక్ట్​కార్మికులకు హైపవర్ ​వేతనాలు, గనులపై మహిళా ఉద్యోగులకు సౌకర్యాల పెంపు, ఆర్కేపీ ఏరియా ఆసుపత్రిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు ఎమ్మెల్యేను కోరారు.

వీటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఐఎన్టీయూసీ లీడర్లు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, తేజావత్ రాంబాబు, నరేందర్, మహంకాళి శ్రీనివాస్, మిట్ట సూర్యానారాయణ, సంఘ బుచ్చయ్య, మండ భాస్కర్​, బన్న లక్ష్మణ్, బత్తుల వేణు, నూనె సాంబయ్య, సత్యనారాయణ

కాంగ్రెస్​లీడర్లు రాఘునాథ్​రెడ్డి, పుల్లూరి లక్ష్మణ్, సొత్కు సుదర్శన్, బండి సదానందం, ఉపేందర్​గౌడ్​, గుడ్ల రమేశ్​, చిర్రకుంట సర్పంచి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.