- సీఎండీ బలరాం నాయక్‌కు ఐఎన్టీయూసీ వినతిపత్రం
గోదావరిఖని, వెలుగు : సింగరేణి కార్మికులకు 2023-–24 సంవత్సరంలో సాధించిన లాభాల్లో 35 శాతం వాటాను చెల్లించాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ కోరారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆర్థిక సంవత్సరం ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసినందున వెంటనే తగు చర్యలు తీసుకుని కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని ఆయన కోరారు.