జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో .. ఘనంగా ఐఎన్టీయూసీ ప్లాటినం జూబ్లీ వేడుకలు

 జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో .. ఘనంగా ఐఎన్టీయూసీ ప్లాటినం జూబ్లీ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) ప్లాటినం జూబ్లీ వేడుకలను బుధవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ ఆల్ ఇండియా సెక్రటరీ, మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్  ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ  ఎమ్మెల్సీ రాములు నాయక్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఝనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్మికులకు  రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం జీహెచ్‌‌‌‌ఎంసీ ఉద్యోగుల సమస్యలను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ ప్రస్తావించారు. యూనియన్ ఎన్నికలు లేబర్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బల్దియా ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందజేయాలని, సెక్రటేరియట్ ఉద్యోగులతో సమానంగా 125 చదరపు గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్​చేశారు.

సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌‌‌‌ను రద్దు చేసి, జనవరి1, 2024న లేదా ఆ తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో కె.శివకుమార్, మెర్సీ తదితరులు పాల్గొన్నారు.