బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లు సింగరేణికే కేటాయించాలి: ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ శ్రేణులు

బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లు సింగరేణికే కేటాయించాలి:	ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ శ్రేణులు

గోదావరిఖని, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖనిలోని జీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంలోని బొగ్గు గనులన్నీంటినీ ఇందిరా గాంధీ జాతీయం చేస్తే.. ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం ప్రైవేట్‌‌‌‌‌‌‌‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. 

పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ బీజేపీతో అంటకాగి, ఎంఎండీఆర్‌‌‌‌‌‌‌‌ చట్టానికి మద్దతు తెలిపి సింగరేణికి నష్టం కలిగించారని ఆరోపించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధికారంలో కోల్పోవడంతో సింగరేణిపై, కార్మికులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, ఆ పార్టీని కార్మికులు నమ్మొద్దని సూచించారు. ధర్నాలో ఏరియా వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కె.సదానందం, లీడర్లు పి.ధర్మపురి, వికాస్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, ఆరెపల్లి శ్రీనివాస్, రాజేందర్, పోచయ్య, మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌, గడ్డం కృష్ణ, నీరటి సాగర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

బొగ్గుబావులు దక్కే వరకు పోరాడుతాం

సింగరేణికి బొగ్గు బావులు దక్కే వరకు పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ వి.సీతారామయ్య చెప్పారు. జీడీకే 2వ గనిపై గురువారం నిర్వహించిన గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లను నామినేషన్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో సింగరేణికే ఇచ్చేలా కృషి చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 5న తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. మడ్డి ఎల్లాగౌడ్, కె.స్వామి, రంగు శ్రీనివాస్, మాదన మహేశ్‌‌‌‌‌‌‌‌, గండి ప్రసాద్ పాల్గొన్నారు.