
ముషీరాబాద్, వెలుగు: కార్మికుల కనీస వేతనాలు పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ చెప్పారు. మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని కార్మిక శాఖ స్టేట్ఆఫీసులో జరిగింది. కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎర్రం పిచ్చిరెడ్డి,ఎస్ నరసింహారెడ్డి, ఎండీ యూసఫ్, రాజు ముదిరాజ్, నీలా జయదేవ్, కశ్యపురెడ్డి, మహిమ దాట్ల, బి.చంద్రప్రకాశ్, ప్రొఫెసర్ సి.రవి, ఎన్.వాసంతి ప్రమాణం చేశారు. తెలంగాణలోని కోటి 20 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచడం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని జనక్ ప్రసాద్ చెప్పారు. వేతనాలు పెంచే దిశగా కమిటీ నిర్ణయాలు ఉంటాయన్నారు.