ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడేళ్లుగా ప్రముఖ ఐటీ కంపెనీలతో సహా పలు రంగాలకు చెందిన సంస్థలు ఐటీ ఉద్యోగులను రకరకాల కారణాలతో తొలగిస్తూనే ఉన్నారు. ఇప్పటిరకు ప్రతి యేటా లక్షల్లో ఐటీ ఉద్యోగులు..ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు. దీనిపై పలు ఐటీ ఎంప్లాయీస్ యూనియన్లు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. కారణాలు ఏవైనా అకస్మాత్తుగా లేదా పింక్ లెటర్ల ద్వారా ఉద్యోగులను తొలగించడంపై చాలా మంది ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | డీఎల్ఎఫ్ చైర్మన్ సింగ్.. అత్యంత సంపన్న రియల్టర్
ఐటీ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్ లో తగ్గింపుకు సంబంధించి పలు కారణాల చేబుతున్నాయి. కంపెనీల నిర్వహణ ఖర్చు పెరుగుతోందని కొన్ని కంపెనీలు కారణాలు చెబుతుండగా.. మరికొన్ని కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీ వైపు దృష్టి పెట్టండం, కొత్త కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించడం వంటి కారణాలతో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.
ALSO READ | టీసీఎస్ లాభం రూ.12,040 కోట్లు
గత మూడేళ్లుగా కొనసాగు ఐటీ కంపెనీల లేఆఫ్స్ ప్రక్రయంలో కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందిన ఇంట్యూట్ (Intuit ) సంస్థ కంపెనీ వర్క్ ఫోర్స్ లో 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ కంపెనీ చెబుతున్న కారణాలు వేరు.. ఉద్యోగుల లో పెర్మార్మెన్స్ కారణంగానే లేఆఫ్స్ ప్రకటించినట్లు చెబుతోంది. వీరి స్థానంలో కొత్తవారిని తీసుకోనున్నట్లు తెలిపింది. ఇంజనీరింగ్, ప్రాడక్ట్ , సేల్స్ విభాగం నుంచి ఈ లేఆఫ్స్ ఉంటాయని చెపుతోంది. ఈ విభాగంలోని దాదాపు 1800 మంది ఐటీ ఎంప్లాయీస్ ని తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈవో ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు.
ALSO READ | ఇండియన్స్కి షాకిచ్చిన ఎలాన్ మస్క్: X(ట్విట్టర్) నుంచి 1.9 లక్షల అకౌంట్లు తొలగింపు