వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి మాల మహానాడు 2025 క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చౌడపూర్ వెంకటేశ్, జిల్లా అధికార ప్రతినిధి ఆర్. రాములు, సలహాదారుడు అనంత రాములు, ప్రధాన కార్యదర్శి ఎన్కేపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎడ్ల సురేశ్, ట్రెజరర్ రత్నం, సలహాదారుడు ప్రేమ్ కుమార్, వసంత్ కుమార్, సోషల్ మీడియా అధ్యక్షుడు ఎల్. శ్రీనివాస్, సహ సలహాదారులు ఏబ్బనూర్ అంజిలయ్య, కె.కృష్ణయ్య, బి.నరేందర్ పాల్గొన్నారు.